Site icon NTV Telugu

Kaithalapur Flyover : గ్రేటర్‌ ప్రజలకు శుభవార్త.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్‌

Flyover

Flyover

హైదరాబాద్‌ అంటే ఓ ట్రాఫిక్‌ సముద్రం. ఈ సముద్రంలో ఈదుతూ ఆఫీస్‌ నుంచి ఇంటికో.. లేక కాలేజ్‌, స్కూల్ ఇలా ఎక్కడి నుంచైనా ఇంటికి వెళ్లేసరికి ఉన్న ఉత్సాహం కాస్తా ఆవిరైపోతుటుంది. కానీ ఇది ఒకప్పటి మాట.. ప్రస్తుతం గ్రేటర్‌ వాసుల కష్టాలు తీర్చేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మెట్రో ప్రారంభమైననాటి నుంచి ఆయా ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్‌ సమస్య తీరినట్లు చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు మరో ఫ్లైఓవర్‌ గ్రేటర్‌వాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు సిద్ధమవుతోంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు కైత్లాపూర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.86 కోట్ల వ్యయంతో 4 లైన్లలో ఆర్వోబీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. కైత్లాపూర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Exit mobile version