Site icon NTV Telugu

Kadiyam Srihari : కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంది

Kadiyam Srihari Brs

Kadiyam Srihari Brs

బీజీపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమి రాలేదని , బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడడం మానుకోవాలన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ ఘనాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రామ మందిరం కట్టిన ఫైజాబాద్ లో బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదన్నారు. ఒక్క చంద్రబాబు, ఒక్క నీతిష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంగా మారుతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు కడియం శ్రీహరి. బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి ఊహించిందే, కానీ నాయకుల మైండ్ సెట్ మారడం లేదని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి అన్న కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలేదని, బీఆర్‌ఎస్‌ పార్టీ మునుముందు ఉంటుందో,లేదో తెలియదన్నారు కడియం శ్రీహరి. ఆ పార్టీ ఎమ్మెల్యే లు ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పలేమని, కొంతమంది స్థాయిని, సభ్యతని మార్చి విమర్శించారన్నారు. కులం, మతం, ప్రాంతాన్ని తప్పు పట్టారని, కుక్క కాటుకు చెప్పులాదెబ్బ లా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ ప్రజలు తన పార్టీ మార్పును కూడా స్వాగతించారని చెప్పారు. 56 వేల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇచ్చారని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందన్నారు. బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమి రాలేదని ఆ పార్టీ నాయకులు ఎగిరెగిరి పడడం, స్థాయికి మించి విమర్శలు చేయటం  మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ఓటింగ్ శాతం కూడా తగ్గిందని చెప్పారు.

ఇండియా కూటమి ఓటింగ్ 7 శాతం పెరిగిందని అన్నారు. రామ మందిరం కట్టిన ఫైజాబాద్ లో బీజీపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదని విమర్శించారు. ఒక్క చంద్రబాబు, ఒక్క నీతిష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంగా మారుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని కడియం శ్రీహరి అన్నారు.

Exit mobile version