NTV Telugu Site icon

KA PAUL: తెలంగాణలో రైతులకు సాయం ఏదీ?

Paul 1

Paul 1

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రశాంత్ కిషోర్ ద్వారా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లు, ఇంకా రోజురోజుకి అప్పులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ కార్మికుల యూనియన్స్ నాతో సమావేశమయ్యాయి. మేం ఢిల్లీ వెళ్లి వచ్చాక.. సీబీఐ విచారణ ప్రారంభం అయింది. డబ్బులు దాచుకోడానికి సీఎం, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.

తెలంగాణలోని రైతులకు సహాయం ఎందుకు చేయరు.? ప్రశాంత్ కిషర్ తో కలిసి అన్ని పార్టీలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు.రేపు 34మంది సివిల్ సర్వీస్ అధికారులు నన్ను కలుస్తున్నారు. చిన్న చిన్న పార్టీలన్నీ మాతో కలుస్తున్నాయి. పార్థసారథి రెడ్డి 550కోట్లతో ఈడీకి చిక్కాడు. పదివేల కోట్లు ఇస్తామని.. బిజెపి రాజ్యసభ సీట్ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ లోని ఒకటి రెండు లీడర్స్ కి నెలకు కోటి రూపాయలు ఇచ్చి కేసీఆర్ మాట్లాడకుండా చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.

వీరు సభకు వెళ్లినా కూడా సస్పెండ్ అయ్యేలా చేస్తాం. 1200 మంది అమరవీరుల్లో ఎవరు అర్హులు దొరకలేదా.? పార్థసారధి రెడ్డి స్టాలిన్, మమతా బెనర్జీని కూడా రాజ్యసభ సీట్ అడిగాడు. 10వేల కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ ని పంపించాడు. రాకేష్ టికాయత్ ని రైతు సంఘాల నుంచే తొలగించారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ పర్యటనలు. తెలంగాణలోని రైతులకు, అమరవీరుల కుటుంబాలకు డబ్బు సహాయం చేయండి.. నిరుద్యోగులను కాపాడండి అని కేఏ పాల్ కోరారు.

బీజేసీ ఇస్తానని చెప్పిన రోడ్ మ్యాప్ ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పుట్టిన ఊర్లోనే ఓట్లు రాలేదు.. ఇక్కడేం చేస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని నాతో కలవమని చెప్పాను, వినలేదన్నారు. పవన్ కళ్యాణ్ కి నూటికి ఒక్క ఓటు లేదు..శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతో మూడు సార్లు మాట్లాడాను. నన్ను కలవడానికి వస్తానంటే, పోలీసులు ఆపుతున్నారు. 1200 మంది అమరవీరుల కుటుంబాలతో నేను టచ్ లో ఉన్నాను. కేసీఆర్ కి కాస్త చిత్తశుద్ధి ఉన్న శంకరమ్మకు రాజ్యసభ సీట్ ఇవ్వు. గతంలో శంకరమ్మకు ఓడిపోయే సీట్ ఇచ్చారు. నీ కూతురికి గెలిచే ఎమ్యెల్సీ సీట్ ఇచ్చావు. నీ కుటుంబంలో ఏ ఒక్కరైనా తెలంగాణ కోసం చనిపోయారా.? అని ప్రశ్నించారు కేఏ పాల్.

LIVE: రైతులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ చెక్కుల పంపిణీ