అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కే కేశవరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాముడిని రాజకీయం చేశారని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్ లో చర్చ పెట్టి తీర్మానం చేశారన్నారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్ లో తీర్మనం చేయడం తప్పు.. వ్యతిరేకిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ సభాపతి అధికారం ఉంటుంది కాబట్టి చేశారని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రామలయాన్ని రాజకీయం చేస్తున్నారని, అయోధ్య గుడికి వెళ్ళని వారు దేశ వ్యతిరేకులు కాదన్నారు కేశవరావు. అయోధ్య గుడి గురించి మట్లాడుతున్నారు..యాదాద్రి తెలంగాణ లో అతిపెద్ద దేవాలయం కానీ ఒక్క సారి కూడా ప్రధాని యాదాద్రి గురించి మాట్లాడలేదని, నేను రావణుడి గుడికి వెళ్తున్నానన్నారు.
Trinadha Rao Nakkina: ఫుల్ పేమెంట్ ఇచ్చా.. అది ఇవ్వమంటే.. ఎన్నిసార్లు అడిగినా
బీఆర్ఎస్ కి వెంకటేష్ నేత రాజీనామా ..కాంగ్రెస్ లో చేరికపై స్పందించిన కేకే.. తమ అవసరాలు,సిద్ధాంతాలకు అనుగుణంగా నేతలు పార్టీ మారుతూ ఉంటారన్నారు. వెంటేష్ నేత బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనడంతో బాధ పడ్డానన్నారు. అధికారంలో ఎవరు శాశ్వతం కాదని, అధికారం మారుతూ ఉంటుందన్నారు కేకే. బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో బీజేపీ అంతర్గతంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధమైందని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక రాజీనామా చేశానని అన్నారు. 2018లో తనకు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో నా లక్ష్యాన్ని చేరుకుంటా అని ప్రకటించారు.లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందన్నారు.
