Site icon NTV Telugu

Jurala : కృష్ణా నదికి భారీ వరద.. జూరాల ప్రాజెక్టులో 12 గేట్లు ఎత్తి నీటి విడుదల

Jurala

Jurala

Jurala : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.200 మీటర్ల వద్ద కొనసాగుతోంది. దీనివల్ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి ప్రవాహం గణనీయంగా పెరిగింది.

Vishnu : ‘కన్నప్ప’ స్క్రిప్ట్‌‌ని తెలుగు డైరెక్టర్స్ రిజక్ట్ చేశారు.. కుండ బద్దలు కొట్టిన విష్ణు

ఇటీవల డ్యామ్‌కు సంబంధించిన 9వ గేట్ రోప్ తెగిపోయిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దీంతో పాటు మరో రెండు గేట్ల రోప్‌లు బలహీనంగా ఉండటంతో ఆయకట్టు రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అధికారులు స్పందిస్తూ.. ఎలాంటి ప్రమాదం లేదని, అవసరమైన ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోప్‌ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో మొత్తం 67 రేడియల్ గేట్లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది గేట్ల రోప్‌లు తుప్పుపట్టినట్లు గుర్తించగా, ఇప్పటికే నాలుగు రోప్‌లు మార్చారు. మిగతా నాలుగు రోప్‌లు మార్చేలోపే వాటిలో ఒకటి తెగిపోయింది. వరద ఉధృతి దృష్టిలో ఉంచుకుని, అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Ivory Smugglers: హైదరాబాద్‌లో ఏనుగు దంతాల కేసు.. కొనసాగుతున్న విచారణ

Exit mobile version