NTV Telugu Site icon

VC Sajjanar : జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌పై అవగాహన కల్పించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Sajjanar

Sajjanar

VC Sajjanar : టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆయన ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. “జంప్‌డ్ డిపాజిట్ స్కామ్” పేరిట జరుగుతున్న మోసాలపై ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఈ సందేశంలో భాగంగా, స్కామ్‌ వివరాలు తెలియజేసే వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన హెచ్చరిస్తూ, “మీకు తెలియని వ్యక్తుల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు మీ ఖాతాలో జమయితే సంబరపడిపోకండి. ఆ డబ్బులు చూసేందుకు బ్యాలెన్స్ చెక్ చేస్తూ పిన్ ఎంటర్ చేస్తే, మీ ఖాతా ఖాళీ అవుతుంది” అని తెలిపారు.

PM Modi: నా వల్ల కూడా తప్పులు జరిగాయ్.. నేనూ మనిషినే, దేవుడిని కాదు..

యూపీఐ ఐడీ ద్వారా సైబర్ నేరగాళ్లు ఫేక్ పేమెంట్ లింకులు పంపించి డబ్బులు దోచుకునే ప్రమాదం ఉందని, అలాంటి లింకులకు స్పందించరాదని సూచించారు. మోసానికి గురైనవారంతా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలంతా ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, తమ ఖాతాల భద్రతను రక్షించుకోవాలని సజ్జనార్ స్పష్టం చేశారు.

Shamshabad: కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

Show comments