Akbaruddin: అక్బరుద్దీన్ కేసులో కాసేపట్లో తుది తీర్పు.. ఓల్డ్ సిటీలో టెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ ప్రసంగంలోని గొంతు అక్బరుద్దీన్‌దేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఇప్పటికే నిర్ధారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో మంగళవారం రోజే తుది తీర్పు ఇవ్వాల్సిన ఉన్నా.. ఈ రోజుకు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు..
Read Also: Akbaruddin: అక్బరుద్దీన్ కేసులో కాసేపట్లో తుది తీర్పు.. ఓల్డ్ సిటీలో టెన్షన్..!
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో అప్రమత్తం అయిన హైదరాబాద్ పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓల్డ్ సిటీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ ఏరియాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు.. చార్మినార్, మక్కా మసీద్, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు పోలీసు ఉన్నతాధికారులు.. నాలుగు ప్లాటున్ల బలగాలు, 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. ఎలాంటి తీర్పు వెలువడిన శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు చెబుతున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..