జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేపు కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో కొట్టుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వంటే నువ్వేనంటూ ఐదుగురు మైనర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాలికను ట్రాప్ చేద్దామని నువ్వే అన్నావని కార్పొరేటర్ కుమారుడు టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. అతణ్ని టార్గెట్ చేసుకుని మిగిలిన నలుగురు దాడి చేశారు. అతను తిరగబడి వీరిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులు, జువైనల్ హోం అధికారుల జోక్యంతో వారికి సర్ది చెప్పి ఈ వివాదం సద్దుమణిగేలా చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనతో నిందితులు ఉన్న జువెనైల్ హోమ్ కు పోలీసులు భద్రత పెంచారు.
ఏ – 1 సాదుద్దీన్‌కి కస్టడీ ముగిసింది
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మలిక్ పోలీసుల కస్టడీ ముగిసింది. ఈ రోజు ఉదయం ఏ – 1 అయిన సాదుద్దీన్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మలిక్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్నటితో సాదుద్దీన్ మాలిక్ కస్టడీ ముగిసింది. నాలుగు రోజుల పాటు మాలిక్‌ను పోలీసులు విచారించారు. మరోవైపు ఈకేసులో మైనర్ నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
అయితే.. బాలికపై గ్యాంగ్‌రేప్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడే అసలు సూత్రధారి అని సాదుద్దీన్ వెల్లడించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సాదుద్దీన్ ఏం చెప్పాడంటే.. ‘‘పబ్‌లోకి రాగానే కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు.. అమ్మాయిలను వెతకడం ప్రారంభించారు.
పబ్‌లో ఇద్దరూ కలిసి మైనర్లను వేధించారు. కార్పొరేటర్ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు కలిసి తొలుత బాధితురాలి వెంటపడ్డారు. వద్దని నేను(సాదుద్దీన్ మాలిక్) వారించాను. నా బెంజ్ కారులో బాలికను ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు చెప్పాడు. దీంతో నన్ను పబ్ దగ్గర వదిలేసి.. బాలికను ఎమ్మెల్యే కొడుకు బెంజ్ కారులో ఎక్కించుకున్నాడు. కారులోకి ఎక్కగానే బాలికను ఎమ్మెల్యే కొడుకు వేధించాడు’’ అని తెలిపాడు. కాగా.. మిగిలిన ఐదుగురు మాత్రం మరోలా చెబుతున్నారు. సాదుద్దీన్ రెచ్చగొట్టినందువల్లే తాము లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడించారు.
Guntur Police: కంతేరులో జరిగింది వ్యక్తిగత గొడవ.. రాజకీయ గొడవ కాదు