తెలంగాణపై గురిపెట్టిన బీజేపీ.. ఇతర పార్టీల నేతలను.. బీజేపీలోకి ఆహ్వానించే పనిలోపడింది.. ఇప్పటికే చాలా మంది నేతలతో కమలం పార్టీ నేతలు టచ్‌లోకి వెళ్లారట.. మరికొందరు.. వారికి టచ్‌లోకి వస్తున్నారట.. అయితే, పార్టీలో చేరికలు, ఇప్పటికే పార్టీలో ఉన్నవారు చెప్పే అభ్యంతరాలపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీ విస్తరణకు పనిచేయాలని సూచించారు.. దళితుల బస్తీలకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోండి, వారితో కలిసి భోజనం చేయండి, యువమోర్చా… యువజన సంఘాలతో స్పోర్ట్స్ పర్సన్స్ తో కాంటాక్ట్స్ పెట్టుకోవాలని.. వారిని రెగ్యులర్‌గా కలవాలని, మహిళా మోర్చా స్వయం సహాయక బృందాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి అని సూచించారు నడ్డా.
Read Also: Bandi Sanjay: టీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే..!
తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి.. కొత్తవారు పార్టీలో చేరుతున్నారు… చేరేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు జేపీ నడ్డా.. అయితే, పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానించండి.. కానీ, అడ్డుకోకండి అని సూచించారు. పార్టీలో ప్రాధాన్యతపై ఇంకొకరితో పోల్చుకోకండి.. ఈ అవకాశం మరోసారి రాదన్నారు. మీ కన్నా బలమైన నేతలను పార్టీలో తీసుకువచ్చేలా పనిచేయాలన్న ఆయన.. బీజేపీకి దేశంలోని ఏ పార్టీ సాటి రాదన్నారు. దేశంలోని అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా కుటుంబ పార్టీలేనని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. పార్టీ అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. కష్టపడి పనిచేయండి, క్షేత్రస్థాయిలోకి వెళ్లండి, కలిసి ముందుకు సాగండి, ఫలితాన్ని సాధించండి అంటూ పిలుపునిచ్చారు.