NTV Telugu Site icon

Jogulamba Gadwal: కొండాపురం గ్రామంలో వరుస మరణాలు.. 13 రోజులలో 11 మంది మృతి

Jogulamba Gadwal

Jogulamba Gadwal

Jogulamba Gadwal: కొండాపురం గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 13 రోజులలో 11 మంది మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో ఏదో జరుగుతుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఏదో పట్టి పీడిస్తుందని హోమాలు, పూజలు చేస్తున్నారు. పెద్దవాళ్లు వృద్ధులు పిల్లలతో సహా కలిపి ఏకంగా 11 మంది మృత్యువాత పడటంతో గ్రామ ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. అసలు కొండాపురంలో ఏం జరుగుతుంది అంటూ అనుమాలు వ్యక్తమవుతున్నాయి.

Read also: Success Story: హోటల్‌లో వెయిటర్‌గా ప్రస్థానం..ఇప్పుడు నెలకు రూ.18 కోట్ల సంపాదన

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం, కేటి దొడ్డి మండలం, కొండాపురం గ్రామంలో వరుస మరణాలతో గ్రామప్రజలులో బెంబేలెత్తుతున్నారు. 13 రోజులలో పెద్దవాళ్లు వృద్ధులు పిల్లలతో సహా కలిపి 11 మంది మృతి చెందారు. కొండాపురం గ్రామం కు ఏదో జరిగిందంటూ ఆదివారం అమావాస్య రోజు హోమంతో పూజలు చేపట్టారు గ్రామస్థులు. ఇంటికి 500 చొప్పున వసూలు చేసి కడప నుంచి ఓ వ్యక్తిని తీసుకువచ్చిన హోమం, పూజలు చేశారు. హోమంతో పూజలు చేస్తే గ్రామానికి మేలు జరుగుతుందని.. ఆదివారం అమావాస్య కావడంతో పూజలు చేశారు. గ్రామానికి ఏదో పీడ పట్టిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read also: John Cena: ఆ హీరో మాటలు నా జీవితాన్ని మార్చాయి: జాన్‌ సీనా

11 మంది మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో మృత్యువాత పడ్డ కుటుంబాలతో సహా రూ.500లు వసూలు చేసి గ్రామంలో నిన్న ఆదివారం హోమం పూజలు చేశారు. దీంతో గ్రామ ప్రజలు పీడ పోయిందంటూ ఊరిపి పీల్చుకున్నారు. మరి కొందరు ఇది పీడ కాదు వీరి అనుమానం అంటూ కొట్టి పారేస్తున్నారు. వర్షాకాలంలో రోగాల బారిన పడటం సహజమని చెబుతున్నారు. మూఢనమ్మకాలతో ఆ గ్రామం అనుమానంతో జీవనం సాగిస్తుందని తెలిపారు. ఏది ఏమైనా ఆ గ్రామంలో 13 రోజుల్లో 11 మంది చనిపోవడం పలు అనుమానాలకు తావులేపుతుంది. దీనిపై అధికారులు పట్టించుకుంటారా? లేక గ్రామస్తుల మూఢ నమ్మకాలకు వదిలేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Read also: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద..

మరోవైపు భాద్రాద్రి కొత్తగూడం ఆళ్లపల్లి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. ఎస్సీ కాలనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు పసుపు, కొబ్బరికాయలు ఉంచి, పందిని బలి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అది చూసిన గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకుని క్షుద్ర పూజలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Jeffrey Vandersay: నేను 6 వికెట్లు తీసినా.. ఈ గెలుపు క్రెడిట్‌ మాత్రం వారిదే: వాండర్సే

Show comments