John Cena: ఆ హీరో మాటలు నా జీవితాన్ని మార్చాయి: జాన్ సీనా
- అంబానీ పెళ్లికి జాన్ సీనా
- పౌడర్ బ్లూ రంగు షేర్వాణీలో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్
- ఫుడ్ కోసం భారత్ వస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Cena Enjoyed Indian Food at Ambani Wedding: డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా ఇటీవల భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి అతడు హాజరయ్యాడు. భారతీయ వస్త్రధారణలో జాన్ సీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంబానీ పెళ్లి సందర్భంగా పలువురు బాలీవుడ్ స్టార్లతో సహా చాలా మంది ప్రముఖులను కలిశాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ను జాన్ సీనా కలిసి చాలా సమయం మాట్లాడాడు. తాజాగా షారుక్ తనలో ఎలా స్ఫూర్తి నింపారో వివరించాడు.
జాతీయ మీడియా ఏఎన్‌ఐతో జాన్ సీనా మాట్లాడుతూ.. షారుక్ ఖాన్‌ను కలిసిన తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తికి కరచాలనం చేయడం, వారు ఏం చేశారో వారికే ప్రత్యేకంగా చెప్పడం చాలా భావోద్వేగ క్షణం. టెడ్ టాక్‌లో షారుక్ మాట్లాడారు. నా జీవితంలో సరైన సమయంలో ఆ మాటలు విన్నాను. అవి నాకెంతో స్ఫూర్తిని ఇచ్చాయి. నా జీవితాన్ని చాలా మార్చాయి. అప్పటి నుంచి నా ముందున్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతున్నా. ఏ అవకాశాన్నీ చేజార్చుకోవడం లేదు’ అని జాన్ సీనా చెప్పాడు.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
Also Read: Viral Video: వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరుగెత్తుకొచ్చిన రోహిత్.. వీడియో వైరల్!
భారతీయ వంటకాలపై కూడా జాన్ సీనా స్పందించాడు. ‘అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో అన్ని రకాల వంటకాలను వడ్డించారు. భారత వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. అయితే స్వల్ప కాలమే భారత్‌లో ఉన్నాను. మళ్లీ వెళ్లి మరిన్ని భారత వంటకాలను రుచి చూడాలనుంది. మసాలా, కారం చెమటలు పట్టించాయి. వాటిని ఆస్వాదించడంలో నా సామర్థ్యమెంటో మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటా. త్వరలో భారత్‌కు రావాలనుకుంటున్నా’ అని డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!