Jeevan Reddy: ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర అని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నైతికంగా పతనమయ్యారన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డిని ఆర్థిక లావాదేవీల్లోవాటాదారుడు నిన్ను ఎందుకు విడిచివెళ్ళాడన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతను విస్మరించావన్నారు. ప్రతిపక్ష పాత్రనైన సక్రమంగా నిర్వార్తించమని సలహా ఇచ్చారు. రాజకీయ పార్టీ లు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల దృష్టి మార్చడానికే కేసీఆర్ పంటనష్ట పరిశీలన యాత్ర అన్నారు.
Read also: Harish Rao: ఐదేళ్లకు మించి పాలించిన చరిత్ర కాంగ్రెస్‌లో లేదు.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ..
కేసీఆర్ కనుమరుగు కావద్దు, కేసీఆర్ ప్రజల్లో ఉండాలి వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిలో పెడ్తున్నామన్నారు. చివరి బొట్టు వరకు సాగు నిరందించి రైతులను ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కొల్పావడానికి కారణం కాళేశ్వరం రీ డిజైన్, మిషన్ భగీరథ, యాదాద్రి పవర్ ప్లాంట్ లు అన్నారు. మిషన్ భగీరథ పథకమే దోపిడీ పథకమన్నారు. ఎస్ఆర్ఎస్పీలో నీటి కొరత ఏర్పడడనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే అన్నారు. పంట నష్టపోయిన రైతుల కు ఎకరాకు 10 వేల నష్టపరిహారం అందిస్తామన్నారు. రబీ లో పంటల నష్టానికి కారణం గత ప్రభుత్వ ప్రణాళిక లేని విధానమే అని తెలిపారు.
Read also: Uttam Kumar Reddy: కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే.. కామన్ సెన్స్ ఉండాలి..!
కొప్పుల ఈశ్వర్.. కమలహాసన్ లాగా నటనను చూపిస్తూ దీక్షలు చేస్తున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్ లక్షణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ కి అన్నం పెట్టిన కరీంనగర్ జిల్లా కు కేసీఆర్ ఏమి చేసాడన్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ధర్మపురి ప్రజల తాగు, సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కొప్పుల ఈశ్వర్ తన రాజకీయ జీవితంలో ధర్మపురి ప్రజలకు తాగు, సాగు నీరందించి శాశ్వత పరిష్కారం చూపారా? అని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు సిరిసిల,గజ్వేల్, సిద్దిపేట కు తరాలిపోతున్నాయి ఏం చేసావు ఈశ్వర్? అని ప్రశ్నించారు.
Chada Venkata Reddy: ఫిరాయింపులతో రాజకీయ వ్యవస్థ బూజు పడుతుంది..!