Minister Sridhar Babu: భూపాలపల్లిలో పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జిల్లాలోని గోరికొత్త పల్లి మండలం చెన్నాపూర్ లో కోటి 40 లక్షలతో సబ్ స్టేషన్ ప్రారంభం చేసుకున్నామన్నారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా రూ.8 కోట్ల వ్యయంతో 33/11 కేవీతో మంజూరు నగర్, ధర్మారావు పేట, నవాబుపేటలలో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడించారు. అలాగే, దీర్ఘకాలికంగా సమస్య లేకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదన్నారు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతరాయం కలగకుండా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 6 హామీలలో భాగంగా రాష్ట్రంలో 50 లక్షల మందికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తేల్చి చెప్పారు. జిల్లాలో 47 వేల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం.. 46 వేల వ్యవసాయ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
Read Also: Kannappa: కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఇక, సౌర శక్తి ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మహిళా సంఘాలకు ఇవ్వడానికి సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పాఠశాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం.. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ, 7 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో తీసుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉచిత బస్ ప్రయాణం ఎందుకు ఇస్తున్నారు అని విమర్శిస్తున్నారు.. ఎందుకు ఇస్తున్నామో మహిళలను అడగండి అని సూచించారు. ఇక, గోదావరి నది జలాల కొరకు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులను నిర్మించామని గొప్పలు చెప్పే వాళ్ళు ఈ ప్రాంతానికి ఒక చుక్క నీరు ఇవ్వకుండా తరలించుకెళ్లారని మండిపడ్డారు. గోదావరి నది జలాలకు సంబంధించి ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్టానికి నీరు ఇచ్చిన తర్వాతే మీరు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ముందు మా రాష్ట్రానికి నీరు ఇచ్చిన తర్వాతే పక్కా రాష్ట్రాలకు నీటిని తరలించాలని అప్పుడే చెప్పామని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
Read Also: POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!
అలాగే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తామని చెప్పాం.. ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం.. కొంచం సమయం పట్టొచ్చు కానీ చేసి చూపిస్తాం.. ఇక, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం.. అభివృద్ధి చేసి చూపిస్తామని వెల్లడించారు. కొత్త జిల్లాలో కొత్త మండలాలకు విద్యుత్ ఏఈ కార్యాలయాలు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి నా కృతజ్ఞతలు.. దీంతో పాటు ఇల్లు లేని నిరుపేదలకే ఇవ్వాలని కలెక్టర్ లకు చెప్పాం.. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా అవసరం ఉన్న కూడా కలెక్టర్ చూసి కేటాయిస్తుంది.. వచ్చే విడతలో తప్పకుండా ఇల్లు లేని పేదల అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.
