Site icon NTV Telugu

Six Youths Missing: గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు..

Missing

Missing

Six Youths Missing: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరి నదిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మహదేవపూర్ మండలం అంబటిపల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Seediri Appalaraju : పెన్షన్లను తగ్గించిన ఘనత బాబుదే.. సీదిరి అప్పలరాజు కామెంట్స్..

అయితే, గల్లంతైన వారిలో అంబటిపల్లి గ్రామానికి చెందిన నలుగు యువకులు పత్తి మధుసూదన్, పత్తి శివ మనోజ్, తొగరి రక్షిత్, కర్నాల సాగర్, ఉండగా.. కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులైన పండు, రాహుల్ గోదావరిలో ఈరోజు సాయంత్రం స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి గల్లంతు అయ్యారు. కాగా, విషయం తెలుసుకున్న మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గల్లంతమైన యువకుల కొరకు గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.

Read Also: Bar License Applications: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బార్లకు భారీగా దరఖాస్తులు..

ఇక, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎగువన గోదావరి నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు ఆరుగురు యువకులు గల్లంతు అయిన.. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులకు వెంటనే
సహయక చర్యలు చేపట్టాలని సూచించారు.

Exit mobile version