Deputy CM Bhatti: గత ప్రభుత్వం హయాంలో రైతులు వాడిన విద్యుత్ కు పెద్ద ఎత్తున బకాయిలు పెట్టిన వాటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించి.. ఉచిత కరెంటు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి.. 9 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయని తేల్చి చెప్పారు. ఏడాదికి 70 వేల కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చుపెట్టింది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే.. ఐదేళ్లలో మూడు లక్షల 50 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చెప్పబోతున్నాం.. ఇంత పెద్ద మొత్తంలో రైతుల కోసం ఖర్చుపెట్టిన ప్రభుత్వం దేశంలో ఏక్కడ లేదు.. రూ. 500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నాం.. రాష్ట్రంలో పారిశ్రామికంగా, సంక్షేమ పరంగా, వ్యవసాయ లాంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Read Also: Groom killed: పెళ్లికి ఒక రోజు ముందు వరుడి దారుణహత్య.. వధువు “లవ్ ఎఫైర్” కారణం..
అయితే, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు బయటకి వచ్చినప్పుడు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఆలోచన చేస్తుంది.. గతంలో సంపాదించిన ప్రతి రూపాయిని దోచాలని ఆలోచనతో ఉండేవాళ్లు అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ప్రజల స్థితిగతుల్లో మార్పు జరగలేదు అన్నారు. ఇది గమనించిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్నికి అధికారంలోకి తీసుకొచ్చారని వెల్లడించారు. రూ. 38 వేల కోట్ల నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లకు పెంచి.. అందిన కాడికి దోచుకున్నారు.. ఆ ప్రాజెక్టు ఇప్పుడు పనికి రాకుండా పోయింది అని భట్టి పేర్కొన్నారు.
