Bhupalpally: ఆస్పత్రికి వెళ్లొచ్చే సరికి ఇళ్లు మొత్తం దోచేశారు..
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం ..
- శంకరాంపల్లిలోని బుడగ జంగాల కాలనీలో దొంగలు భారీ చోరీ..
- 18 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhupalpally: కూతురి ప్రసవం కోసం ఆసుపత్రికి వెళితే.. ఇంట్లో సొత్తంతా దోచుకుని పరారయ్యారు దొంగలు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి తాళం పగులగొట్టి సుమారు 18 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, టీవీని అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: Weather Update: తెలంగాణలో పెరుగుతున్న చలి.. వణుకుతున్న జిల్లా వాసులు..
Also Read
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
- Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
శంకరాంపల్లి గ్రామానికి చెందిన అనుమాల సత్యమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. సత్యమ్మకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు కార్తిక్ హైదరాబాద్‌లో ఉంటుండగా, కూతురి ప్రసవం కోసం నాలుగు రోజుల క్రితం సత్యమ్మ తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. గురువారం ఉదయం సత్యమ్మ ఇంటికి తలుపులు తెరిచి ఉండడం చూసిన స్థానికులు అనుమానంతో కార్తిక్, సత్యమ్మకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గడ్డపారతో బీరువాలు పగలగొట్టి ఇంట్లోని సామాగ్రి, దుస్తులను చిందరవందరగా పడివున్నాయి. బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
దీంతో ఇంటి యజమానులు లబోదిబోమన్నారు. వెంటనే కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ నాగార్జునరావు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని చేరుకొని క్షుణ్నంగా పరిశీలించి ఆనవాళ్లను సేకరించారు. కాటారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడో చోట తరుచు దొంగతనాలు జరుగుతున్న నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kazipet Railway Coach: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..