భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో జరిగిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగ మూర్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాజలింగ మూర్తి భార్య సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకొని సీ.సీ.ఎస్ పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. రాజలింగ మూర్తి హత్యకు ప్రధాన కారణంపై పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ముందుగల 319, 320, 171 సర్వే నెంబర్‌లోని భూమిలో తలెత్తిన వివాదాలే రాజలింగ మూర్తి హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Telangana: మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర..
319, 320, 171 సర్వే నెంబర్‌లోని రేణికుంట్ల సంజీవ్, వంశీ కృష్ణ అనే వ్యక్తులకు రాజలింగ మూర్తికి ఉన్న భూ వివాదమే హత్యకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం తెలుస్తోంది. రేణికుంట్ల సంజీవ్, కొమురయ్య, వంశీ కృష్ణ ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా విచారణలో పురోగతి సాధించారు పోలీసులు. రాజలింగ మూర్తిపై దాడి జరిగిన తర్వాత భూపాలపల్లిలోని స్థానిక బీఆర్ఎస్ నేతకు ఈ ముఠా సభ్యులు ఫోన్ చేశారు. అతనికి నిందితులకు దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో బీఆర్ఎస్ నేత పాత్ర పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో మరి కొంతమంది పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజలింగమూర్తి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి సంఖ్య ఐదుగురైన.. పరోక్షంగా మరి కొంత మంది సహకరించారనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. రేపటిలోగా రాజలింగమూర్తి హత్య కేసు కొలిక్కి తీసుకొచ్చే దిశగా పోలీసుల విచారణ కొనసాగుతుంది.
Read Also: Tesla : కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎలోన్ మస్క్ టెస్లాకు భారీ ఆఫర్లు