NTV Telugu Site icon

Jaya Jaya Telangana: రాష్ట్ర గీతంగా జయజయహే తెలంగాణ… పాట రాసింది ఎవరంటే..?

Ande Sri

Ande Sri

Jaya Jaya Telangana: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ పాటను ప్రముఖ కవి అందెశ్రీ రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే ఈ పాట రాశారు.

జయ జయహే తెలంగాణ… జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

Read also: Ponguleti Srinivas Reddy: టీఎస్ కాదు టీజీ.. పేరు మార్పుపై పొంగులేటి క్లారిటీ..!

‘నాది కవిగానం కాదు, కాలజ్ఞానం’ అంటాడు అందెశ్రీ ఆయన చదువుకోలేదు. అందెశ్రీ జనగామ జిల్లా రేవర్తికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన పశువుల కాపరి. తాపీ మేస్త్రీగా పనిచేశారు. 21 ఏళ్లుగా అదే ఆయనకు ఉద్యోగం. అయితే.. కవిత్వం ఆయనకు సహజంగానే వచ్చింది. రాయడం నేర్చుకున్నాడు.. విద్యావంతుడయ్యాడు. డిగ్రీ లేదు కానీ అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందారు. నదులపై కవిత్వం రాస్తూ ప్రపంచమంతా తిరిగాడు. మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ… నదులపై పెద్ద కవిత రాసే పనిలో పడ్డాడు. ‘నిప్పుల వాగు’ పేరుతో వెయ్యేళ్ల నాటి తెలంగాణ పాటను తాజాగా రికార్డు చేశారు. జయజయహే తెలంగాణ.. పాట ఎలా రాశారో చెబుతూ.. తెలంగాణ సాధన సందర్భంగా 2003 మార్చి 2న కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో.. మనకంటూ ఓ పాట ఉండకూడదని అనిపించిందట.. అంతే.. ఆ సమయంలో ఈ పాట అతడిని తాకింది.

Read also: UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి

ఆ ఆలోచన వచ్చిన కొద్దిసేపటికే నాలుగు చరణాలు రాశాడు. మొదటి నాలుగు చరణాలు. తర్వాత 2003 నవంబరు 11న ఆదిలాబాద్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జెండా వందనంలో వీటిని ఆలపించారు. విన్నవారంతా ఏదో తెలియని మైమరుపు.. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పాట పాడుతూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నాడు. మొత్తం 12 చరణాలు. నిజానికి ఈ పాట తెలంగాణ ప్రకటన తర్వాత 9 డిసెంబర్ 2009 తర్వాత కోట్లాది మందికి చేరింది. కానీ, అంతకుముందే ప్రధాన సమావేశాల్లోని కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులకు ఈపాట నోట చేరింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని తెలిపారు. కానీ ఎందుకో జరగలేదు.. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈపాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. దాంతో ఇప్పుడు వాస్తవం కాబోతోంది.
UP Road Accident: వర్షంలో వేగంగా వెళ్లిన కారు.. గొయ్యిలో పడి ఆరుగురు మృతి