Site icon NTV Telugu

Minister KTR: 50 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు చేస్తారట? ప్రతిపక్షాలపై కేటీఆర్‌ ఫైర్‌..

Minister Ktr

Minister Ktr

Minister KTR: 50 ఏళ్లు అధికారంలో ఉన్న తనకు అవకాశం ఇస్తే ఎలా చేస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జవహర్‌నగర్‌లో దుర్వాసన సమస్య గత ప్రభుత్వాల వారసత్వంగా వచ్చిందన్నారు. అనంతరం జీవో నెం.58 కింద 3,619 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న తనకు అవకాశం ఇస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాటిని నమ్మవద్దని సూచించారు.

జవహర్ నగర్ గుట్టను చెత్తతో నింపారని తెలిపారు. ఆ గుట్టపై వాన కురిసి.. చెత్త నుంచి నీరు వచ్చి.. రసాయనంలా కలుషితమై మల్కారం చెరువులోకి చేరింది. దీంతో నీరంతా కలుషితమై నల్లగా మారింది. నల్లగా మారిన మల్కారం చెరువును తెల్లగా మార్చేందుకు కొత్త లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తీసుకొచ్చామన్నారు. 250 కోట్లు వెచ్చించి మల్కారం చెరువులో చెత్త నుంచి రసాయనాలతో నల్లగా మారిన నీటిని శుద్ధి చేసేందుకు మిషనరీలు పెట్టామని తెలిపారు. ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో మల్కారం చెరువును శుద్ధి చేసి మంచినీటిని దిగువకు పంపిస్తున్నారని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు కూడా మెరుగవుతాయని అన్నారు. 550 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మించినా, మంచి నీటిని శుద్ధి చేసే ఈ ప్లాంట్ 250 కోట్లతో, రెండో దశ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ మరో 550 కోట్లతో నిర్మించారని అన్నారు. నేను జపాన్‌కు వెళ్ళినా, జపాన్ ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరం.

అక్కడే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉంది. అక్కడ పైన ఏమో పార్క్‌ ఉంది. ప్లాంట్‌ ఏమో కింద ఉంది. అక్కడ ఏ మాత్రం వాసన లేదు. జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నగరంగూడలో ఈరోజు కాకపోతే ఏడాది 18 నెలల పాటు చేస్తామన్నారు. వారసత్వంగా వస్తున్న ఈ సమస్యను పరిష్కరించి, ఈ ప్రాంత ప్రజలకు మంచి నీరు, మంచి గాలి అందించాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నామన్నారు. నాల్గవ రకం వ్యర్థాలు మురికి నీరు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ దాదాపు 2000 MLD (2000 మిలియన్ లీటర్లు) వ్యర్థ జలాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ జులై నాటికి 100 శాతం ఎస్టీపీలతో భారతదేశంలోనే తొలి నగరంగా హైదరాబాద్‌ అవతరించబోతోందని తెలిపారు. హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇందుకోసం 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.
Nanda deepam: 700 ఏళ్ల నుంచి ఆరని అఖండ జ్యోతి.. ఎక్కడో తెలుసా?

Exit mobile version