NTV Telugu Site icon

Jangaon: పండగ ఎఫెక్ట్.. దసరా ముందు 30 మేకలను ఎత్తుకెళ్లిన దొంగలు..

Janagon

Janagon

తెలంగాణలో దసరా పండగ అంటేనే మందు, మాంసంతో ఎంజాయ్ చేస్తారు. అందరి ఇళ్లలో పండగ రోజు మటన్, మద్యం లేకుండా ఉండదు. పండగ కోసం అప్పు చేసి మరీ.. కొనుకుంటారు. ఇదిలా ఉంటే.. మార్కెట్‌లో ఈ సమయంలో మేకలకు, గొర్రెలకు డిమాండ్ ఎక్కువ. ఒక్కో మేక, గొర్రె మామలు సమయం కన్నా.. వెయ్యి రెండు వేలు ఎక్కువనే పలుకుతుంది. ఎంత డిమాండ్ ఉన్నా.. కొనకుండా మాత్రం ఉండరు. అమ్మకందారులైతే.. పండగ సీజన్ అదునుగా చూసి ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. ఏదో విధంగా అయితే.. దసరా పండగ రోజు మాత్రం ఇంట్లో మటన్ కర్రీ ఉండాల్సిందే..

Read Also: Nayanathara: పిల్లల విషయంలో మరో వివాదంలో లేడీ సూపర్ స్టార్!

వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టం నుండి అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు వాటి విలువ ఉంటుందని ఆవేదన చేందుతున్నాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగలను వెతికే పనిలో ఉన్నారు.

Read Also: Home Minister Vangalapudi Anitha: వైసీపీకి హోం మంత్రి అనిత సవాల్.. మేం రెడీ.. మీరు సిద్ధమా..?