Harish Rao: మన సీఎంకు.. మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదని ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాక్యలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల చింతబావి తండాలో ఎండిపోయిన పంట పొలాలను హరీష్ రావు, కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రైతులకు ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఎలక్షన్ సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక రైతులకు మొండి చేయి చూపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి, వడగండ్ల వానలు పడి పంట నష్టం తీవ్రంగా జరిగిందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదన్నారు.
Also Read
రాష్ట్రంలో 180 మంది రైతులు చనిపోయిన వారిని ఓదార్చలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుల ఇండ్లలోకి పోయి పార్టీలను తెచ్చుకునే టైం ఉంది కానీ.. రైతులను ఓదార్చే సమయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం తెరవాల్సింది కాంగ్రెస్ పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. వంద రోజులు గడిచినా కూడా రైతుబంధు ఇవ్వని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 25వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు 500 బోనస్ ఇస్తా అనే నమ్మబలికిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని తెలిపారు. రైతులకు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుండి రైతులను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఎండిపోయిన రైతుల పొలాల దగ్గరికి వెళ్లి పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు కరెంటు, మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
Gaza Crisis : సరిహద్దులో నిలిచిన ట్రక్కులు.. పెరుగుతున్న ఆకలి చావులు
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!