Site icon NTV Telugu

హుజురాబాద్‌లో పోసానిపై జనసేన ఫిర్యాదు..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై దర్శకనిర్మాత, రచయిత, సినీ నటుడు పోసాని మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. పోసాని వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు పవన్‌ అభిమానులు.. పోసానిపై దాడికి కూడా యత్నించారు.. పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జీ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేశామని.. పోసానిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు జనసేన స్థానిక నేతలు.

Exit mobile version