NTV Telugu Site icon

Palla Rajeshwar Reddy: కేసులు,అరెస్టులు కొత్త కాదు.. పార్టీ మారే ప్రసక్తే లేదు..

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy: జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని సంచలన ఆరోపణ చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేధింపుల్లో భాగంగా తన పై ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదు చేశారన్నారు. నాతో పాటు నా భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కూడా కేసులు పెట్టారని తెలిపారు. అలాంటి వాటికి భయపడకుండ న్యాయపోరాటం చేస్తా అన్నారు.

Read also: పురుషులపై ప్లాస్టిక్ ప్రభావం.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు..

ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, కేసులు, అరెస్టులు నాకు కొత్త కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఇలాంటి వాతావరణం చూడలేదని అన్నారు. బీఆర్ఎస్ లోకి రాక ముందు ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేశానని, నాడు ఉమ్మడి పాలకులు కేసులు పెట్టారు, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు పాటించాలి, గెలిచిన పార్టీలోనే ఐదేండ్లు ఉండాలని పల్లా రాజేశ్వర్ క్లారిటీ ఇచ్చారు.
Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..