Jana Reddy: బీజేపీతని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధాని వ్యవహారంలో రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. అధికార అహంకారంతో బీజేపీబిజెపి పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడకుండా చేసేందుకు అనర్హత వేటు వేశారని నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజాస్వామ్యంను కాపాడాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు. మోడీ పరిపాలన ను వ్యతిరేకిస్తూ ఒక BRS పార్టీ కాదు దేశంలో 17 పార్టీలు కలిసి వస్తున్నాయని జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో గొంతు కలపాలని కోరుతున్నామని తెలిపారు. బీజేపీ దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Pawan Kalyan: ఏప్రిల్ 5 నుంచి ‘భగత్ సింగ్’గా మారనున్న పవర్ స్టార్
నీరవ్ మోడీ, లలిత్ మోడీలు అగ్ర వర్ణాల వాళ్ళు అని, కానీ ఓబీసీ లను రాహుల్ కించ పరిచారని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దేశం కోసం పని చేసిన కుటుంబంలోని రాహుల్ గాంధీని బీజేపీ వాళ్ళు దేశ ద్రోహి అనడం తప్పుని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే కుట్ర బీజేపీ చేస్తుందని, ఇది బీజేపీ అధికారకాంక్ష కోసమే అని ఆరోపించారు. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే వాళ్లపై కేసులు పెట్టాలంటే వందల కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ లతో కాంగ్రెస్ ,విపక్షాలను బీజేపీ వేధిస్తుందని, టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు. బీజేపీ ఆగడాలను అడ్డుకోవాడానికి అన్ని పార్టీలతో కలిసి పోవడానికి ఇప్పటికే సంకేతాలు వచ్చాయని, తన కుమారుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని ప్రకటించారు. దాని గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదని కొడుకు పొలిటికల్ ఎంట్రీపై జనారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Today Business Headlines 31-03-23: నీతా అంబానీ కల్చరల్ సెంటర్. నేడే ప్రారంభం. మరిన్ని వార్తలు
