Site icon NTV Telugu

జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి జరుగుతున్న కృషి అభినందనీయమన్న ఆయన.. అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు.. అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేసి… తెలంగాణకు కాంగ్రెస్ మాత్రమే దిక్సూచి అని నిరూపించాలని సూచించారు. దీనికోసం నా వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు జానారెడ్డి.. ఇక, అడుగడుగున పిలిస్తే నేను రాలేదు అని అనుకోకండి.. మీరు ఏదైనా గద వదిలేస్తే… అది అందించడానికి నేను వస్తానంటూ వ్యాఖ్యానించారు జానారెడ్డి.. ఇవాళ గాంధీ భవన్‌ వేదికగా పీపీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి జానారెడ్డి, వి. హనుమంతరావు హాజరయ్యారు.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక మొదటి సారి గాంధీ భవన్ కి వచ్చారు ఈ ఇద్దరు నేతలు.. ఈ సందర్భంగా.. జానారెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Exit mobile version