కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. వనమా విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.
Jalagam Venkatarao: తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని.. తనపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు పగటికలలు కంటున్నారని అలానే ప్రచారం చేసుకుంటున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. వారి పగటి కలలు నెరవేరవని వెల్లడించారు.