NTV Telugu Site icon

Jairam Ramesh: ఇద్దరు కోటీశ్వరులతో పోటీపడ్డారు.. పాల్వయి స్రవంతికి జైరాం రమేశ్ కితాబు

Jairam Ramesh Bharath Jodo Yatra

Jairam Ramesh Bharath Jodo Yatra

Jairam Ramesh: ఇద్దరు కోటీశ్వరులతో పోటీపడ్డారని, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వయి స్రవంతికి కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ కితాబు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా జైరాం రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ జోడోయాత్ర పదకొండు రోజుల పాటు 319 కిలోమీటర్లు, 8 జిల్లాల్లో సాగిందని తెలిపారు. దక్షిణ భారతంలో ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్ర పూర్తి చేసుకుని.. ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందని అన్నారు. నేటితో దక్షిణ భారత యాత్ర ముగిసి.. రేపట్నుంచి ఉత్తర భారత యాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి రాహుల్ యాత్రకు స్పందన లభించిందని అన్నారు. వారి వారి సమస్యలను వివరించారని, ఇది ఉపన్యాసాలిచ్చే మన్ కీ బాత్ కాదు.. ప్రజల సమస్యలు వినిపించుకునే యాత్ర అని ఎద్దేవ చేశారు. హైదరాబాద్ లో మా జోడోయాత్రకు విశేష స్పందన లభించిందని అన్నారు. ఒక మునుగోడు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ.. మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదు.. నోట్ల ఎన్నిక అని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని చంపేసి మద్యం, ధనంతో గెల్చిన ఎన్నిక మునుగోడు అని అన్నారు. తెలంగాణాలో ఎన్నికలంటే వన్ సీర్ టూ మ సీఆర్ త్రీసీఆర్ ఫోర్ సీఆర్ కేసీఆర్ అంటూ ఎద్దేవ చేశారు. ఇక పాల్వాయి స్రవంతి బాగా పోరాడారని ఆమెకు అభినందించారు. మేం మునుగోడు విషయంలో చింతించడంలేదని అన్నారు.

Read also: MBBS State Rank: నిజామాబాద్‌ బిడ్డకు ఎంబీబీఎస్‌ లో స్టేట్‌ ర్యాంక్‌.. కానీ

భారత్ జోడోయాత్ర ప్రభావం లేదని ఎవరన్నా అన్నా మేం పట్టించుకోమన్నారు. జోడోయాత్ర ఉద్ధేశ్యం వేరని తెలిపారు. భారత్ జోడోయాత్ర బీజేపీ, ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్ ను విచారానికి గురిచేసిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మా ఆపోనెంట్ బీజేపీ ఒకటే అయితే.. తెలంగాణాలో మాకు బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు ప్రత్యర్ధులున్నారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమిని, ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. ఆత్మపరిశీలన, సమీక్ష చేసుకుంటామని తెలిపారు. తెలంగాణాలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండబోతోందని అన్నారు. భారత్ జోడోయాత్ర తెలంగాణాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని అన్నారు. మునుగోడులో జరిగింది మద్యం, మని ఎన్నికలు అని విమర్శించారు. గెలిచింది మద్యం, మని అని ఎద్దేవ చేశారు. ప్రజాస్వామ్యన్నీ కూని చేశారన్నారు. పాల్వాయి స్రవంతి గొప్ప ధైర్యం ఉన్న వ్యక్తి అని, ఇద్దరు కోటీశ్వరుల మధ్య స్రవంతి పోటీ చేశారని అన్నారు. 200 కోట్ల మద్యం తాగించారని, భారత్ జోడో యాత్రకి దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారన్నారు. మునుగోడులో ఏం జరిగింది అనేది సమీక్ష చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ నే అని అన్నారు. కొత్త ఉత్సాహంతో కొత్త శక్తితో కాంగ్రెస్ దూసుకొస్తుందని జైరాం రమేశ్ అన్నారు.
Today Gold Rate : మహిళలకు షాక్‌.. పెరిగిన బంగారం ధరలు..