MBBS State Rank: వారిది నిరుపేద కుటుంబం. కానీ పై చదువులు చదవాలనుకుంది. ఎలాగైనా డాక్టర్ చదవి పేదవాల్లకు తనవంతు సేవ చేయాలనుకుంది. కానీ తనకు పేదరికం అడ్డు వచ్చింది. ఏం చేయాలన్నా నిరుపేద కుటుంబం కావడంతో.. తన ఆశలు అడిఆశలు అవుతాయేమో అని ఒక ఆలోచన చేసింది. తనకు ఫీజులు కూడా చెల్లించలేని స్ధితిలో వున్న కుటుంబానికి భారం కాకుండా తన ఆలోచనతో ఎంబీబీఎస్ చదువుకునేందుకు తన మొబైల్ లో క్లాసులు వినింది. చివరకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుంది. కానీ.. పేద కుటుంబం కావడంతో దాతల కోసం ఎదురు చూస్తోంది.
Read also: Sania Mirza Divorce: షోయబ్తో విబేధాలు.. విడాకులు తీసుకోబోతున్న సానియా మీర్జా ?
నిజామాబాద్ జిల్లా నాందేవ్వడకు చెందిన సతీ శ్రీ కుమార్, అనురాధలకు హారిక, ఈశ్వర్ పిల్లలు. వీరి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూతురు హారిక పదో తరగతి, ఇంటర్, మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. డాక్టర్ హారిక కావాలన్న కోరిక ఉన్నానీట్ కోచింగ్కు వెళ్లే స్థోమత లేదు. అయినా వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజూ యూట్యూబ్లో వీడియో క్లాసులు చూసి పరీక్షలకు సిద్ధమైంది. ఈ సంవత్సరం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంక్ సాధించింది. కాలేజీలో సీటు వచ్చినా ఫీజు, హాస్టల్, బుక్స్ ఫీజులు కలిపి కనీసం రూ.రెండు లక్షల వరకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు లేకపోవడంతో చదువుకు దూరమవుతానేమోనని ఆవేదన చెందుతోంది. తాను ఎంబీబీఎస్ చదివేందుకు దాతలు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటోంది. మరి వీరిపై ఏదాత సహాయం అందించనున్నారో!.. ఆతల్లి ఆశలు నెరవేరేనా?
Free Amazon Prime : ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ అందిస్తున్న ఎయిర్‌టెల్, జియో, వీఐ