Site icon NTV Telugu

Jagtial Crime: గంగారెడ్డి మర్డర్ కేసు.. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు..

Jagital Crime

Jagital Crime

Jagtial Crime: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన గంగారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు ఇవాళ పోలీసులకు లొంగిపోయాడు. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నిందితుడు సంతోష్ అక్కడ అధికారులకు తానే గంగారెడ్డి హత్య చేసినట్లు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం గంగారెడ్డిని కారుతో ఢీ కొట్టడమే కాకుండా.. సుమారు 18 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు సంతోష్‌. హత్య అనంతరం లొంగిపోయేందుకు నేరుగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు రాగా అక్కడ జనాలు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుండి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అయితే అక్కడ కూడా అధికారులు ఎవరు లేకపోవడంతో.. చివరకు ఎస్పీ కార్యాలానికి వెళ్లి లొంగిపోయాడు నిందితుడు సంతోష్‌. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిందితుడు సంతోష్ ను మొదట మల్యాలా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మరో పోలీస్టేషన్‌ కు తరలించి రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. గంగారెడ్డిని ఎందుకు హత్య చేశాడు? రాజకీయ కారణాలా? లేక ఎవరైనా చెబితే గంగారెడ్డిని హత్య చేశాడా? అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. నిందితుని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కాల్ డేటా, వాట్సాప్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారైన విషయం తెలిసిందే..
BJP Team: నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బృందాల పర్యటన..

Exit mobile version