జగిత్యాల జిల్లా కోరుట్ల జీఎస్ గార్డెన్ లో నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 1971లో దాయాది దేశం పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బంగ్లాదేశ్ దేశాన్ని విభజన చేయకుండా ఉంటే పాకిస్తాన్ మన పక్కలో బల్లమై ఉంటుండే అని తెలిపారు. పాకిస్తాన్ ను ముక్కలు చేసి బంగ్లాదేశ్ తలెత్తకుండా రక్షణ ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ అని పేర్కొన్నారు.
Read Also: BRS: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్..
2018 డిసెంబర్ లో పిలవని పేరంటానికి పోయి నవాజ్ షరీఫ్ తో మోడీ షీర్ కుర్బత్ తిని వచ్చిండని జీవన్ రెడ్డి విమర్శించారు. దేశం కానీ దేశానికి ఎందుకు వెళ్ళాడని దుయ్యబట్టారు. చైనా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఇందిరాగాంధీ దయతోనే మోడీ ప్రధాని అయ్యాడని.. పాకిస్తాన్ పై యుద్ధం గెలిచిన తర్వాత లోక్ సభలో ఇందిరాగాంధీని అపర దుర్గాదేవితో పోల్చిన వ్యక్తి వాజ్ పాయ్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: CM Jagan: ఆరోజే సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేషన్..!?
ఇదిలా ఉంటే.. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ దూకుడు ప్రదర్శించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.