Site icon NTV Telugu

Jagtial: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ సమావేశం..

Jeevan Reddy

Jeevan Reddy

Jagtial: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనుచరుడు గంగిరెడ్డి హత్యకు గురవడంతో విషాదంలో ఉన్న జీవన్ రెడ్డిని ఓదార్చి.. ఆయనకు పార్టీ తరఫున న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీతో పలు విషయాలపై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. జీవన్ రెడ్డిని మధుయాష్కి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. బయల్దేరిన తొలి బోటు

ఈ సందర్భంగా పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు.. ఆయన సేవలు పార్టీకి మరింత అవసరం.. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో వదులు కోరాదన్నారు. జీవన్ రెడ్డికి ఉన్న అభ్యంతరాలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇక, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాబితాపూర్ లోని గంగారెడ్డి కుటుంబ సభ్యులను మధుయాష్కి పరామర్శించారు.

Exit mobile version