తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం అమలులో కొంతమంది ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు.
Also Read : PBKS vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న పంజాబ్ కింగ్స్
జగిత్యాల జిల్లా కేంద్రం లో ని ప్రెస్ క్లబ్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు ప్రెస్ మీట్ పెట్టారు. జీవన్ రెడ్డి దళిత బంధు పథకంపై మతిబ్రమించి, సంస్కరహీనంగా మాట్లాడారు అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు జీవన్ రెడ్డికి మెదడు లేదు అంటూ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు అంటూ మండిపడ్డారు.
Also Read : Shweta Death Case: శ్వేత మృతికి కారణం అదే..! షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీపీ
కాంగ్రెస్- బీజేపీలు రెండు అవిభక్త పల్లెలు దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడితే నాయకులను జైలుకు పంపిస్తాం అని BRS ప్లీనరి సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడినది మాకే తెలుస్తది.. మీకు ఎలా తెలుస్తుంది జీవన్ రెడ్డి అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రశ్నించారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను వక్రీకరించారు అని ఆయన ఆరోపించారు. దళిత బంధు పథకంలో అవినీతి పాల్పడితే మీకు టికెట్లు ఉండవు.. సీఎం కేసీఆర్ అన్నారు.. జగిత్యాల అభివృద్ధి కనబడడం లేదా జీవన్ రెడ్డి దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా చూసింది మీరు కదా.. దళితులకు కాంగ్రెస్ హయాంలో ఎం చేసారో చెప్పాలి.. భారత దేశ చరిత్రలో దళితబంధు పథకం సువర్ణ అధ్యాయము అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు.