Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు (జనవరి 3న) తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజయ్య స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 7:45కి మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న పవన్.. 8:35 గంటలకి గన్నవరం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు పయనం కానున్నారు. ఉదయం 9:20కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని.. 9:30కి బేగంపేట నుంచి ప్రత్యక హెలికాప్టర్‌లో కొండగట్టుకు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు.
Read Also: Delhi Firing: ఢిల్లీలో కాల్పుల కలకలం.. ఓ వ్యాపారి నుంచి రూ. 3 కోట్లు డిమాండ్
ఇక, ఉదయం 10:30 నుంచి 11:30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా JNTU దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగనున్నారు. హెలిప్యాడ్ వద్ద పవన్ కు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలకనున్నారు. JNTU కళాశాల నుంచి రోడ్ మార్గంలో కొండగట్టుకు ఆయన చేరుకోనున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో టీటీడీ నిధులతో రూ. 35.19 కోట్లతో 96 గదుల సత్రం నిర్మాణానికి, మాల విరమణ మండపానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ శంకుస్థాపన చేయనుండగా.. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు. అలాగే, బృందావనం రిసార్ట్ లో జనసేన కార్యకర్తలు, నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు డిప్యూటీ సీఎం.
