NTV Telugu Site icon

Blocked Jagityala: అష్టదిగ్బందంలో జగిత్యాల.. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు

Jagityala Master Plan

Jagityala Master Plan

Blocked Jagityala: జగిత్యాలలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్బందంకు గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మాస్టర్ ప్లాన్ వద్దని కాంగ్రెస్ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలకు రైతుల ప్రణాళికలు సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని గ్రామాల్లో గ్రామ సభలు నిరసనలు వెళ్లువెత్తాయి.
మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. తిమ్మపూర్ గ్రామ సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై రైతులకు మద్దతు తెలిపారు. పలు గ్రామాల ఏకగ్రీవ తీర్మానాలను గ్రామస్థులు మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. మాస్టర్ ఫ్లాన్ పై నిరసనలు ఉదృతం ఏర్పాటుకు చేసేందుకు రైతులు, రైతు జేఏసీ సన్నద్ధం అవుతున్నారు.

Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్తని ఎందుకో వదిలేసిందో తెలుసా?

జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ విలీన గ్రామాల రైతులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా జగిత్యాల రైతులు కూడా ఆందోళనలు చేపట్టారు. అంతకుముందు జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Read also: Tension in Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై కొనసాగుతున్న ఆందోళనలు.. నేటితో కౌన్సిలర్ల రాజీనామాకు డెడ్ లైన్

జగిత్యాల మాస్టర్ ప్లాన్ పరిధిలో నర్సింగాపూర్, కండ్లపల్లి, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హుస్నాబాద్, లింగంపేట, మోతె గ్రామాలను చేర్చాలనే ప్రతిపాదన ఉంది. . భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేస్తుంది. అయితే మాస్టర్ ప్లాన్ కు అవసరమైన భూమిని సేకరిస్తారు. దీంతో ఆయా గ్రామాల రైతులు భూములు కోల్పోతామంటూ ఆందోళన చెందుతున్నారు.
Kanti Velugu: నేడు కంటి వెలుగు రెండో విడత.. ఆధార్‌, రేషన్‌, ఆరోగ్యశ్రీ తప్పనిసరి

Show comments