Site icon NTV Telugu

MLC Kavitha : ప్రజాపాలన అంటే ఇదేనా..?

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha : జగిత్యాలలో జరిగిన దారుణ ఘటనపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని, కలెక్టర్ ఎదుటే కానిస్టేబుల్ ఈడ్చి, అతని వీల్‌చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఎమ్మెల్సీ కవిత ఈ సంఘటనను “ప్రజాపాలన అంటే ఇదేనా?” అని ప్రశ్నిస్తూ, దీనిని అత్యంత దుర్మార్గమైన చర్యగా ఖండించారు. బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక, తన కళ్ల ముందే ఇంతటి ఘటన జరిగి కూడా స్పందించని జగిత్యాల కలెక్టర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Nandi Awards: నంది అవార్డుల పేరు మార్పు.. సినిమాటోగ్రఫీ మంత్రి కీలక ప్రకటన

Exit mobile version