Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్
- బాలుడిని తల్లిదండ్రుల నుంచి తిరిగి తీసుకోవాలని పిటిషన్
- గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే కోరిన అధికారులు
- దత్తత చట్టబద్ధతపై లోతైన విచారణ జరపాలని విజ్ఞప్తి
- సీడబ్ల్యూసీ సంరక్షణకు అప్పగించాలని హైకోర్టును కోరిన కలెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మూడేళ్ల బాలుడి చట్టబద్ధమైన దత్తత వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని, విచారణ పూర్తయ్యే వరకు ఆ బాలుడిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సంరక్షణకు అప్పగించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ , సీడబ్ల్యూసీ అధికారులు ఉమ్మడిగా హైకోర్టును ఆశ్రయించారు.
సోషల్ మీడియా వీడియో వైరల్.. తల్లిదండ్రులకు అప్పగింత
చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదన్న వివాదంతో అధికారుల నుంచి తమ మూడేళ్ల బాలుడిని విడదీయడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అక్టోబర్ 16న హైకోర్టు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల అమల్లో అధికారులు జాప్యం చేశారనే విమర్శలు కూడా వచ్చాయి.
Also Read
- Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
- Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
- KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..
- ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రిట్ పిటిషన్
తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కలెక్టర్ సత్యప్రసాద్ , సీడబ్ల్యూసీ అధికారులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీడబ్ల్యూసీ సమర్పించిన ఆధారాలు, నిబంధనలను పరిశీలించకుండానే గతంలో ఆ ఉత్తర్వులు ఇచ్చారని పిటిషన్లో వారు పేర్కొన్నారు. కేవలం హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన దత్తతను చట్టపరమైన దత్తత ప్రక్రియగా పరిగణించవచ్చా అనే అంశంపై లోతుగా పరిశీలించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
CWC సంరక్షణకే బాలుడిని అప్పగించాలని విజ్ఞప్తి
ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ సజావుగా సాగడానికి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు బాలుడిని తిరిగి సీడబ్ల్యూసీ కేంద్రానికే అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులు కోరారు. బాలుడిని తల్లిదండ్రుల వద్దే ఉంచాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై తక్షణమే స్టే విధించాలని జగిత్యాల కలెక్టర్ , సీడబ్ల్యూసీ అధికారులు పిటిషన్లో స్పష్టం చేశారు. దీంతో ఈ జగిత్యాల దత్తత వివాదంపై హైకోర్టు తదుపరి ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్
-
Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
-
Reasons Behind Republican Defeat: ఇరాన్ వార్ నుంచి అభ్యర్థుల ఫెయిల్యూర్ దాకా.. ట్రంప్ పార్టీ ఓటమికి అసలు కారణాలివే!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!