Jagga Reddy: మంత్రి హరీష్ కి మీడియాలో సమాధానం చెప్పను.. పబ్లిక్ లో సమాధానం చెప్తా అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బి ఫార్మ్ తీసుకున్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి హరీష్ రావ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ కి నిద్ర కరువైందని, నిద్ర లేక ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ వాదం తేవాలని చూస్తుందని మండిపడ్డారు. ఏం చేయాలో అర్థం కాక.. ప్రభుత్వం రాదని పిచ్చెక్కి.. వాదం తెర మీదకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులు బయట పడాలని కుట్ర మొదలు పెట్టారని నిప్పులు చెరిగారు. రాష్ట్రం వచ్చినాక ఇంకా తెలంగాణ వాదం ఏంటి? అని ప్రశ్నించారు. పబ్లిక్ ని ఏం అనుకుంటున్నారు. ప్రజలను మోసం చేయొచ్చు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. నాగార్జున సాగర్.. శ్రీశైలం కూడా నేనే కట్టిన అని కేసీఆర్ చెప్పడం లేదు.. అది మా లక్కు అంటూ వ్యంగాస్త్రం వేశారు. జూరాలా..సింగూరు.. లాంటివి కూడా నేనే కట్టినా అని చెప్పుకుంటే మాకు ఇబ్బంది అయ్యేదని సెటైర్ వేశారు.
50 ప్రాజెక్టు లు కట్టింది మేము.. ఒక్కటి కట్టి.. ఎదో చెప్తున్నారు.. ఆ కట్టిన ఒక్కటి కూడా కుంగిపోయే అన్నారు. బీఆర్ఎస్ కర్ణాటక గురించి మాట్లాడుతున్నారంటేనే భయంతో ఉన్నారు అని తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే క్లారిటీ బీఆర్ఎస్ నేతలకు కూడా ఉందన్నారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ తో ఏం లబ్ది చేకూరడం లేదని క్లారిటీ కి వచ్చారని అన్నారు. బీఆర్ఎస్ అనాలో.. టీఆర్ఎస్ అనాలో అర్థం కావడం లేదన్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నామని వ్యంగాస్త్రం వేశారు. కర్ణాటక ది లేనిది ఉన్నట్టు చెప్పి తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకను అడ్డం పెట్టుకుని ఆట ఆడాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు విన్నవిస్తున్న.. ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి రావాలని కుట్ర చేస్తుంది బీఆర్ఎస్ అని తెలిపారు. సీఎం ఎవరు అనేది ఖర్గే..అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. వాళ్ళ నిర్ణయం ఫైనల్ అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ తల్లిదండ్రుల పాత్ర కాదు..ఇంట్లో పిల్లల లాంటి పాత్ర అన్నారు. మాకు కుటుంబం పెద్ద లాంటి పాత్ర సోనియా..రాహుల్ ది అన్నారు.
తల్లిదండ్రులు లేని కొడుకు ఆవారా ఐతరు.. బీఆర్ఎస్ కూడా ఆవారా పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఏడాది కింద పుట్టింది .. 130 ఏండ్ల కింద పుట్టింది కాంగ్రెస్.. మాకు.. వాళ్లకు పోటీ ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలను కేసీఆర్ ఏదైనా చేశారా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ కి పిలుచుకున్నాడా ? ఆ కుటుంబ పిల్లల బాగోగులు చూశారా? ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డాగా ఉన్న ఓయూ.. కాకతీయ యూనివర్సిటీ కి కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లాడా? అని మండిపడ్డారు. 9 ఏండ్లలో ఎప్పుడు అయినా యూనివర్సిటీ కి వెళ్లాడా ..
సమాధానం ఎందుకు చెప్పడు కేసీఆర్ అని ప్రశ్నించారు.
Mahadev Betting APP: సీఎంకు రూ. 508 కోట్లు ఇచ్చా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సంచలన వ్యాఖ్యలు!