NTV Telugu Site icon

Jagga Reddy: పువ్వాడ ఓ సైకో.. వెంటనే బర్తరఫ్‌ చేయాలి..

Jagga Reddy

Jagga Reddy

ఖమ్మం రాజకీయాలను ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్‌ హీటు పుట్టిస్తున్నారు.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం ఓవైపు అయితే.. మరోవైపు.. కాంగ్రెస్‌ నేతలపై కూడా వేధింపులు పెరిగాయంటూ జిల్లా నేతలతో పాటు.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఇక, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పువ్వాడ ఓ సైకో అని కామెంట్‌ చేసిన ఆయన.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు.. పువ్వాడకి కొందరు పోలీసులు చెంచా గిరి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువ అయ్యాయన్న జగ్గారెడ్డి.. వెంటనే సీఎం కేసీఆర్‌.. మంత్రి పువ్వాడని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read Also: KTR Tour Postponed: కేటీఆర్‌ ఖమ్మం పర్యటన రద్దు.. కారణం ఇదే..!

ఇక, మూడేళ్లుగా అజయ్ మీద ఉన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు జగ్గారెడ్డి.. కేసీఆర్‌ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమన్న ఆయన.. ఎస్పీ ఏం చేస్తున్నారు.. ఇంత జరుగుతుంటే.. పోలీసులపై విశ్వాసం పోకుండా చూసుకోవాలన్నారు.. పువ్వాడను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు.. అంతేకాదు, కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలన్నారు జగ్గారెడ్డి.. కార్యకర్తలపై పీడీ యాక్ట్‌ కేసులు పెట్టిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని.. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ కాలయాపన చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందన్నారు. మరోవైపు.. బీజేపీ కార్యకర్త మృతిపై స్పందిస్తూ.. పోలీసులు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.. వాంగ్మూలం ఎమ్మార్వో, పోలీసు అధికారులు తీసుకోవాలి.. కానీ, మీడియా తీసుకుందన్న ఆయన.. వాంగ్మూలం తీసుకోలేదు అంటేనే.. ఇది హత్య అని పేర్కొన్నారు. ఈ కేసులో ఎమ్మార్వో, ఆర్డీవో, సీఐ, డీఎస్పీలను కూడా విచారించాలని డిమాండ్‌ చేశారు జగ్గారెడ్డి.