Site icon NTV Telugu

Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారు..

Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy: కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి అన్నారు. తుక్కుగుడా సభ పెట్టి మరొక సారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇప్పటికే సభలను పెట్టి అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ వి.. మోసపు మాటలు , హామీలన్నీ నీటి మూటలన్నారు. కర్ణాటక లో మోసపు హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. నెలకు 2500 ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు ఇప్పుడు 2 లక్షలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇస్తున్నారని తెలిపారు. పార్టీ మారినోడిని పక్కన కూర్చోబెట్టుకుని పార్టీ ఫిరాయింపుల మీద హాస్యాస్పదంగా కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. కేసీఆర్ రాకతో లాగులు తడిసి బాహుబలి మోటర్లు అన్ చేశారన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు నీళ్లను ఎలా వదిలారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుల కోసం KRMB అయ్యకు తెల్వకుండా నీళ్లు ఇచ్చిండని తెలిపారు.

Read also: Etela Rajender: దానం నాగేందర్ కు ఎట్లా ఎంపీ సీట్ ఇస్తారు..?

వసూళ్ల కోసమే రేవంత్ కష్టపడుతున్నారు..కుర్చీని కాపాడుకోవడానికే కష్ట పడుతున్నారని తెలిపారు. క్రికెట్ మ్యాచ్ లు ముఖ్యంసూట్లు వేసుకోవడం ముఖ్యమన్నారు. ఎర్రటి ఎండలో కేసీఆర్ రైతుల కోసం వెళ్తే.. కాంగ్రెస్ రైతు గీతు జాన్తానై అన్నట్టు మాట్లాడిందన్నారు. జానారెడ్డిని కాదు నేను రేవంత్ రెడ్డిని అని సీఎం అంటున్నాడని తెలిపారు. జానారెడ్డి సమర్థుడా కాదా అనేది రేవంత్ రెడ్డి, జానారెడ్డి తేల్చుకోవాలన్నారు. జానారెడ్డి మంచివాడా? చెడ్డవాడా? అనేది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. దేశంలో ఫిరాయింపులకు మూలం కాంగ్రెస్ అన్నారు. రైతుల తరపున మాట్లాడితే, నీళ్లు అడిగితే జైల్లో పెడతారా? అని మండిపడ్డారు. కేసీఆర్ ను జైల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులా…పోలీసులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు మంత్రికి కరెంటు ఇచ్చే సోయి లేదు…నీళ్ల మంత్రికి నీళ్లు ఇచ్చే సోయి లేదన్నారు. జైళ్లకు భయపడటానికి కేసీఆర్ ..రాహుల్ గాంధీ కాదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Allu Arjun: ఆ లెటర్‌ పూర్తిగా చదవలేదు.. కానీ ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్‌

Exit mobile version