Site icon NTV Telugu

Jagadish Reddy : కవిత వాడుతున్న పదాలు రేవంత్, రాధాకృష్ణవే

Jagadish Reddy Brs

Jagadish Reddy Brs

Jagadish Reddy : బీఆర్‌ఎస్‌లో నెలకొన్న విభేదాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన, ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. “నా ఉద్యమ ప్రస్థానంపై ఉన్న జ్ఞానానికి కవితకు జోహార్లు” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన, “కేసీఆర్‌కు బద్ధ శత్రువులైన రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ ఏమి మాట్లాడుతున్నారో అదే పదాలను కవిత వాడుతున్నారు” అని విమర్శించారు. “వాళ్లు ఉపయోగించిన పదాలను కవిత వల్లెవేస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.

Tamannaah : విరాట్ కోహ్లీతో పెళ్లి చేశారు.. తమన్నా షాకింగ్ కామెంట్స్

నల్గొండ జిల్లాలో 25 ఏళ్లుగా జరిగిన ఉద్యమాలు, ఎన్నికల విజయాల్లో తన పాత్రను గుర్తు చేసిన జగదీష్ రెడ్డి, “విజయానికి నేను బాధ్యుడినైతే ఓటమికీ నేను బాధ్యుడినే” అని అన్నారు. “పార్టీ అంతిమ నిర్ణయమే ఫైనల్. వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకోవడం భ్రమ” అని స్పష్టం చేశారు. తాను పార్టీ సైనికుడినని, కేసీఆర్‌ను ఇటీవల 50 సార్లు కలిసినా కవిత గురించి ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. “వారి గురించి మాట్లాడటం వృథా అని మాత్రమే చెప్పాను” అని ఆయన వివరించారు.

కేసీఆర్‌తో బనకచర్ల, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరిగిందని తెలిపారు. “కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము, అందులో ఎలాంటి సందేహం లేదు” అని వ్యాఖ్యానించిన ఆయన, “నేను చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచాను. కానీ కొంతమంది గెలవలేదు కదా” అని గుర్తుచేశారు. అలాగే కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని, చూసి ఉంటే తప్పకుండా స్పందించేవాడినని అన్నారు.

BSF Tradesman Recruitment: BSFలో ట్రేడ్స్‌మన్ కానిస్టేబుల్ 3588 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా!

Exit mobile version