Site icon NTV Telugu

మూడేళ్లు కుంభకర్ణ నిద్రపోయిండా కేసీఆర్‌..? : ఈటల రాజేందర్‌

సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్‌ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ లో బెయిల్ పై విడుదల అయిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మీడియా పై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి భయపెడుతున్నారని మండిపడ్డారు. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రపతి సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారని.. స్థానికత ఆధారంగా టీచర్లను, ఉద్యోగులను విభజించాలని డిమాండ్‌ చేశారు. మూడేళ్ల పాటు కుంభకర్ణ నిద్ర పోయిన తర్వాత సీఎం జీవో నెంబర్‌ 317 ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: ఉద్యోగుల కేటాయింపు పై బీజేపీ డ్రామాలు: భట్టి విక్రమార్క

తొందరపాటు నిర్ణయంతో జీవో ఆర్డర్‌ ఇవ్వడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం వారి వినతులు కూడా స్వీకరించక పోతే, మా దగ్గరికి వస్తే మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వారి పక్షాన జాగరణ చేశారన్నారు. కరీంనగర్ సీపీ ప్రత్యక్షంగా పాల్గొని లాఠీఛార్జి చేసి, అరెస్టు చేసి, జైలు పాలు చేశారు. ఇన్ని చేసినా మేము సహించామని పేర్కొన్నారు.ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను కేసులు పెట్టారు భయభ్రాంతులకు గురి చేశారు సరే… కానీ ఆ ఉద్యోగులకు ఎలాగైనా న్యాయం చేయండి. స్థానికత ఆధారంగా నియామాకాలు బదిలీలు చేయండని అంటూ ఈటల డిమాండ్‌ చేశారు.

Exit mobile version