ఉద్యోగుల కేటాయింపు పై బీజేపీ డ్రామాలు: భట్టి విక్రమార్క

ఉద్యోగ బదీలీలపై కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారటీఆర్‌ఎస్‌, బీజేపీ పై మండిపడ్డారు. జీఓ 317తో స్థానికత అనేదానికి న్యాయం లేకుండా పోయిందన్నారు. స్థానికత కోసం తెచ్చుకున్న తెలంగాణలో నేడు గందరగోళం సృష్టించారన్నారు. స్థానికత పై రాష్ట్రం పంపిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రపతికి పంపి ఆమోదం వేయించింది మీరు అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు బండి సంజయ్‌ డ్రామాలు వేస్తున్నారన్నారు. రాష్ట్రం నివేదిక పంపినప్పుడు మీరు గాడిదలు కాశారా..? అంటూ ధ్వజమెత్తారు. కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించిందన్నారు.మిర్చిపంటను ..తామర, గులాబీ పురుగు నాశనం చేసిందన్నారు. తామర పువ్వు దేశాన్ని నాశనం చేసినట్టు… మిర్చి పంట నాశనం చేస్తుందని ఎద్దేవా చేశారు. త్వరలో మిర్చి రైతుల వద్దకు కాంగ్రెస్ సీఎల్పీ నేతలు వెళ్లి పరామర్శిస్తారన్నారు.

Read Also: స్కానింగ్‌ కోసం వస్తే.. ఇంజక్షన్‌ ఇచ్చి ప్రాణాలు తీశారు

టీఆర్‌ఎస్‌పై భట్టి విమర్శల దాడులకు దిగారు. వనమా రాఘవ వేధింపులకు అనేక మంది బలి అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వనమరాఘవపై హత్య, హైదరాబాద్‌లో అత్యాచార కేసులు ఉన్నాయన్నారు. పోలీసులను టీఆర్‌ఎస్‌ క్యాడర్‌గా మార్చుకుందని విమర్శించారు. పోలీసులను వాళ్ళ ఉద్యోగాలు చేయనీయడం లేదని భట్టి ఆరోపించారు. పోలీసులను పోలీసు పనులు చేసుకోనివ్వాలని గవర్నర్‌ను కలిసి వివరించి చెప్తామని భట్టి అన్నారు. పాల్వంచ ఘటనపై ఎమ్మెల్యే వనమా రాఘవను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును వెంటనే విరమించుకోవాలని సూచించారు. ఇప్పటికే గ్యాస్..డీజిల్..పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

Related Articles

Latest Articles