NTV Telugu Site icon

Minister Sridhar Babu: శ్వేత పత్రాలను చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లమొహంవేశారు

Sridhar Babu

Sridhar Babu

గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీ‌లో శ్వేత పత్రం విడుదల చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో మేము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచాం. అందుకే గత పదేళ్ళలో BRS పాలన ఎలా సాగిందో అసెంబ్లీ‌లో శ్వేత పత్రం విడుదల చేశాం. గత ప్రభుత్వం పాలనలో తప్పులు జరిగాయి. శ్వేత పత్రాలు నిజమేనని, అప్పులు చేశామని.. చేసిన ఖర్చు వల్ల ప్రయోజనాలు లేవని గత ప్రభుత్వం ఒప్పుకుంది. రాష్ట్రంలో ప్రతి యువకుడి పై 7లక్షల అప్పును BRS ప్రభుత్వం మోపింది.

Also Read: #HBDYSJagan: ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు.. ట్రెండింగ్‌లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్

కాంగ్రెస్ ఆనాడు అభివృద్ధి అడుగులు వేస్తే …BRS పదేళ్లు అనుభవించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు చెయ్యకపోతే BRS 12 గంటల కరెంట్ ఇచ్చేది కాదు. అప్పులపై జవాబు చెప్పలేక BRS ఎమ్మెల్యేలు తెల్లమొహాలు పెట్టారు. రేషన్ బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధర, విద్యా వ్యవస్థ పై సమాధానం చెప్పకుండా BRS నాయకులు తెల్లమొహం వేశారు. గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా విధానం ఎలా ఉంది.. మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ , ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు తెల్లమొహాలు వేశారు. 2018లో అసెంబ్లీలో ఈ పార్టీ ఎంతసేపు మాట్లాడిందో లెక్కలు చెప్పలేదు ఎందుకంటే BRS లో కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు కాబట్టి. శ్వేత పత్రాల్లోని లెక్కలు తప్పులు అనేది అవాస్తవం.. తేదీలు వెయ్యలేదు కాబట్టి కన్ఫ్యూజన్ ఏర్పడింది.

Also Read: Corona Cases: హైదరాబాద్లో కరోనా హడల్.. మరో ఇద్దరికి పాజిటివ్

అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం.. కావాలంటే స్పీకర్ అదేశంతో ప్రతీ సభ్యుడికి అందిస్తాం. శ్వేత పత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరికి సంశయం అవసరం లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగ దారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తాం. ప్రజాస్వామ్య దృక్పథంతో లెక్కలు ప్రజల ముందు పెట్టాం. గతంలో BRS ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తరువాత అసెంబ్లీ పెట్టీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మేము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీ పెట్టినాం. ఎవరినో కించపరిచాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు’ అని మంత్రి పేర్కొన్నారు.

Show comments