NTV Telugu Site icon

Minister KTR: బీబీసీ పై ఐటీ దాడులు.. తర్వాత హిండెన్‌బర్గ్‌ పైనా? కేటీఆర్ రియాక్షన్

Ktr Minister

Ktr Minister

Minister KTR: బీబీసీ కార్యాలయంపై ఇవాళ ఐటీ దాడులు సంచలనంగా మారింది. దీనిపై ఐటీ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ ఆశక్తి కరంగా మారింది. ఏమి ఆశ్చర్యం అంటూ స్మైలీ ఇమోజీని పెట్టారు. మోడీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత, BBC ఇండియాపై ఐటీ దాడులా? అంటూ వ్యంగాస్ర్తం వేశారు. ఐటీ, సీబీఐ, ఈడీ ఏజెన్సీలు బీజేపీకి పెద్ద కీలుబొమ్మలుగా మారడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. తర్వాత ఏంటి? హిండెన్‌బర్గ్‌ పై ED దాడులా? లేక టేకోవర్ ప్రయత్నమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపంచారు. ఇప్పుడు కేటీఆర్‌ ట్వీట్‌ సంచలనంగా మారింది.

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం. లండన్‌కు చెందిన కంపెనీపై కార్యాలయం ఎందుకు దాడి చేసిందో స్పష్టంగా తెలియలేదు. కొన్ని నివేదికలు శాఖ కార్యాలయాన్ని కూడా సీల్ చేయవచ్చని సూచిస్తున్నాయి. 60 నుంచి 70 మంది సభ్యుల బృందం బీబీసీ కార్యాలయానికి చేరుకుని సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగులందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అంతేకాకుండా కార్యాలయంలోకి ఇతరుల ప్రవేశం, నిష్క్రమణ కూడా నిషేధించబడింది. బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Read also: KTR: వెజ్, నాన్ వెజ్ మార్కెట్లపై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

ఇప్పటికే మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇండియాతో పాటు బ్రిటన్‌లో కూడా వివాదాస్పదం అయింది ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ‘ ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీతో తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ భారత ప్రధానిపై విమర్శలు చేస్తే, పలువురు ఎంపీలు మోదీకి మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంట్ నేపథ్యంలో బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read also: Bandi Sanjay: కేసీఆర్‌ ఇంకా ఈటల ఆయన మనిషి అనుకుంటున్నారు

అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని తిరస్కరించింది. దీన్ని తప్పుడు భావనగా పేర్కొంది. ఒక డాక్యుమెంటరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్.. బీబీసీ ఉద్దేశపూర్వకంగా భారత ప్రతిష్టను కించపరుస్తుందని వాదించారు. ఈ డాక్యుమెంటరీ వెనక కుట్ర దాగి ఉందని ఎన్ఐఏతో విచారణ దర్యాప్తు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా.. బీబీసీ ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు బీబీసీ ఐటీ దాడులు చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీపై డాక్యుమెంటరీ నేపథ్యంలోనే ఐటీ దాడులకు కేంద్రం ఉసిగొల్పినట్లు ఆరోపించింది. మొదట వారు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించారని, ఇప్పుడు ఐటీ దాడులను ప్రేరేపించారని, ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి అంటూ కాంగ్రెస్ మండిపడింది. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ సంచలనంగా మారింది.
MLC: తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ