Site icon NTV Telugu

Y. S. Sharmila: అవినీతిని ప్రశ్నిస్తే తప్పట, ఓ..అవినీతి మంత్రి మరదలు అంటే తప్పులేదట

Sharmila

Sharmila

Y. S. Sharmila: పాదయాత్రలో పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే తప్పట, ఒక నీతి మాలిన, అవినీతి మంత్రి నన్ను మరదలు అంటే తప్పులేదట అంటూ ఫైర్‌ అయ్యారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నేను ఏవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో సమాధానం చెప్పుకోలేక ఏకమయ్యి నా మీద స్పీకర్ కి పిర్యాదు చేశారు. ఇదే ఐకమత్యం పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఎందుకు చూపలేదు? అని ప్రశ్నించారు. 8 ఏళ్లుగా ప్రాజెక్ట్ పూర్తి చేయక పోతే ఐకమత్యం చూపించాల్సిన అవసరం లేదా..? అని మండిపడ్డారు.

ఈ పాలమూరు ప్రాజెక్ట్ దక్షిణ తెలంగాణకి ఎంతో కీలకం అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ ను ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి అటక ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు పోరాడలేదని విమర్శించారు.నోరు విప్పలేదు, అసెంబ్లీలో కనీసం ప్రస్తావన కూడా లేదని షర్మిళ అన్నారు. పాలమూరు ప్రజలు ఒట్లేస్తే గెలిచారు కదా.. 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ కదా..నన్ను ఎదుర్కోలేక కలిసి కట్టుగా పిర్యాదు చేస్తారా? అంటూ ఫైర్‌ అయ్యారు షర్మిళ. మీ అవినీతి మీద విచారణ చేసే దమ్ము మీకుందా? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఅర్ మీద విచారణ చేసే దమ్ముందా? కేసీఅర్ బిడ్డ కవిత లిక్కర్ స్కాం మీద విచారణ చేసే దమ్ముందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కెటిఆర్ అవినీతి మీద విచారణ చేసే దమ్ముందా? వైఎస్‌ ష్మరిళ ప్రశ్నలు విసిరారు. నేను మీకు సవాల్‌ విసురుతున్నా.. మీకు దమ్ముంటే నామీద విచారణ చేయండి.. ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. డేట్ మీరు ఇస్తారా…నన్ను ఇవ్వమంటారా..?అసెంబ్లీ కి ఎప్పుడు రావాలి చెప్పండి? నా మీద పిర్యాదు చేసిన ఈ ఎమ్మెల్యేలు చేత కానీ దద్దమ్మలు. నా మీద పిర్యాదు చేశాక పుకార్లు.. షికార్లు చేస్తున్నాయి.
Flood of Godavari and Krishnamma: గోదావరి, కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల

Exit mobile version