NTV Telugu Site icon

Yadadri temple: వాయిద్యకారుల నియామకాల్లో అవకతవకలు.. ఐదుగురు సస్పెండ్

Yadadri Temple

Yadadri Temple

Yadadri temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో విధులు నిర్వహించే డోలు వాయిద్యకారుడు వెంకటసుబ్బయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ వాయిద్యకారుల పోస్టుల నియామకాల బోర్డు మెంబర్ గా ఉన్న వెంకటసుబ్బయ్య సస్పెన్షన్ సంచలనంగా మారింది. వాయిద్య కారుల నియామకాలలో వెంకటసుబ్బయ్య అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో వెంకటసుబ్బయ్య పై ఈ సస్పెన్షన్ వేటు పడింది. యాదాద్రి ఆలయ వాయిద్యకారుల నియామకాలలో అవకతవకలు జరిగాయని, లక్షలాది రూపాయల డబ్బు చేతులు మారాయి అని ఆరోపణలు రావడంతో దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. ఈ విచారణలో వెంకట సుబ్బయ్య పై వచ్చిన ఆరోపణలు దేవాదాయ శాఖ నిజమని తేల్చి చెప్పింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది దేవాదాయ శాఖ. అయితే వెంకటసుబ్బయ్య సెలెక్ట్ చేసిన రాఘవేంద్ర (నాదస్వరం), సురేంద్ర (తాళం), ప్రకాష్ (డోలు) సుదర్శన్ (శృతి) ఈ నలుగురిని కూడా ఆలయ ఈవో సస్పెండ్ చేశారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

3 డోలు, 3 సన్నాయి, 2 శృతి, 2 తాళం… మొత్తం 10 పోస్టులకు ఈ ఏడాది జనవరి 5, 6 తేదీలలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. యాదాద్రి ఆలయానికి చెందిన వెంకటసుబ్బయ్య తోపాటు భద్రాచలం ఆలయానికి చెందిన మరో ఇద్దరు మొత్తం ముగ్గురు సభ్యుల బోర్డు ఈ ఇంటర్వ్యూలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మొత్తం 150 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా కేవలం వారికి డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఈ ఉద్యోగాలను కట్టబెట్టారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో దేవదాయ శాఖ స్పందించి వెంటనే విచారణ చేపట్టింది. ఇందుకు కారణమైన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వెంకటసుబ్బయ్య ఇంతకు మందు కూడా ఇలానే చేశారా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌