TG Inter Supply Results: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. కాగా.. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సర అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలో 63.86% ఉతిర్ణత సాధించారు. మొదటి ఏడాది పరీక్షలకు 254498 మంది విద్యార్థులు హాజరయ్యారు. లక్షా 62వేల 520 మంది ఉత్తిర్ణత సాధించారు. పరీక్షకు 18913 మంది ఓకేషన్ విద్యార్థులు హాజరుకాగా.. ఓకేషల్ విద్యార్థుల్లో 53.24% ఉత్తిర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 138477 మంది జనరల్ విద్యార్థులు పరీక్ష రాయగా.. 43.77% మంది ఉత్తిర్ణత సాధించారు. 15137 మంది ఓకేషన్ విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 51.12% 7737 మంది ఉత్తిర్ణత సాధించారు.
Read also: Health Tips : మెరిసే చర్మానికి విటమిన్ సి చాలా అవసరం.. అందుకే ఈ ఆహారాలను తీసుకోండి
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలకోసం www://tgbie.cgg.gov.in, http://results.cgg. gov.in వెబ్‌సైట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల మార్కులను కూడా విడుదల చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ , ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు దాదాపు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. వీరిలో పరీక్షల్లో ఫెయిలైనవారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే.. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.
Big Breaking: బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..!