Baby Sale : నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా పుట్టిన పసికందును అమ్మేందుకు ఓ తల్లి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. డబ్బుల విషయంలో చోటుచేసుకున్న గొడవతో ఈ అంశం బయటపడటంతో పోలీసులు విచారణ ప్రారంభించి కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓ మహిళ తన appena పుట్టిన శిశువును పులాంగ్‌కు చెందిన ఓ దంపతులకు విక్రయించింది. ఈ లావాదేవీకి మొత్తం రూ. 2 లక్షల ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
D Gukesh: ‘బలహీనమైన ఆటగాడు’ అన్న కార్ల్‌సెన్.. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో ఓడించిన గుకేష్
ఇప్పటికే లక్ష రూపాయలు చెల్లించగా, మిగిలిన లక్ష రూపాయల చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి విషయమంతా బయటపడింది. పసికందు విక్రయం వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు తక్షణమే స్పందించి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో తల్లి, పిల్లను కొనుగోలు చేసిన దంపతులతో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసికందులను వస్తువుల్లా అమ్ముకుంటున్న పరిస్థితిపై న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Piracy: సినిమాలను ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నారు..? దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా..?
