NTV Telugu Site icon

Indigo flight: హైదరాబాద్ లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం?

Indigo

Indigo

Indigo Landing: హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో 6 E 897 విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. వారనాసి నుండి బెంగుళూరు వెల్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారిమల్లించారు ఫైలెట్‌. బెంగుళూరు బయలుదేరిన విమానం హైదరాబాద్‌ లో ల్యాండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు గుండె ఆగినంత పని అయ్యింది. ప్రమాదంలో వున్నమా? అసలు సేఫ్‌ గా కిందికి దిగుతామా? అనే అనుమాణాలు, భయంతో కాసేపు ఏంజరుగుతుందో అన్న విధంగా ఉండిపోయారు విమానంలో ఉన్న ప్రయాణికులు. అయితే వారనాసి నుంచి బయలు దేరిన విమానంలో అప్పటి వరకు ఏలోపం లేకుండా బాగానే వున్నా.. కొద్ది గంటలకు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు సమీపంలో వున్నా మని భావించిన పైలెట్‌ ప్రయాణికులుకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సేఫ్ గానే విమానం ల్యాండింగ్‌ కావడంతో విమానంలో వున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసినట్లు తెలుపడంతో.. ప్రయాణికులు, సిబ్బంది పైలెట్ ను ప్రసంసల జల్లు కురిపించారు. కాగా.. శంషాబాద్‌ లో విమానానికి మరమత్తులు చేయడంతో మళ్లీ అక్కడనుంచి బెంగుళూరు బయలుదేరింది.

Read also: EAPCET-2023: ఈఏపీ సెట్‌లో మళ్లీ ఇంటర్‌ వెయిటేజీ..

అయితే ఇలా ఇండిగో విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది మొదటి సారి కాదు.. ఇలా చాలా మార్లు ఇండిగో విమానాల్లోని లోపాల వలన అత్యవసర ల్యాండింగ్‌ అవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ముందుగానే సిబ్బంది విమానాన్ని ఎందుకు పరీక్షించడంలేదు. అసలు పరీక్షిస్తే ఇలా లోపాలు ఎందుకు తలెత్తుతున్నాయి. ఇలా ఒకసారి రెండు సార్లుకాదు కదా? విమానంలో లోపాలు తలెత్తినప్పుడు పైలెట్‌ అప్రమత్తమై అత్యవసర ల్యాండ్ చేసేందుకు ఎయిర్‌ పోర్టుల దగ్గరలో వున్నాయని ప్రయాణికుల ప్రాణాప్రాయం లేకుండా బయటపడుతున్నాం ఒకవేల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఎయిర్‌ పోర్ట్‌ లు దగ్గర లేకుంటే ప్రయాణికుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విమానంలో టేకాఫ్‌ కు ముందే ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు.
EAPCET-2023: ఈఏపీ సెట్‌లో మళ్లీ ఇంటర్‌ వెయిటేజీ..

Show comments