Hyderabad Weather: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు మొదలైన చలిగాలులు మరుసటి రోజు ఉదయం 10 గంటల తర్వాత కూడా తగ్గడం లేదు. బయటకు వాళ్లేవారే కాదు.. ఇంట్లో ఉన్నవాళ్లు కూడా చలికి వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలిగాలులు కొనసాగుతుండటంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు బయటకు రావాలంటే చలికి గజ గజా వణికిపోతున్నారు. సోమవారం పటాన్ చెరువులో 6.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంది.
Read also: Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు టూరిజం పాలసీపై చర్చ..
ఈ జిల్లాలకు హెచ్చరికలు..
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్’, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలు, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశాలున్నాయని సూచించింది.
Read also: Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి..!
ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ముఖానికి మాస్కులు, స్వెటర్లు లేకుండా ప్రజలు బయటకు రావడం లేదు. చలిగాలులు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతాయని, సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు. దీంతో నగరంలో ఊటీ తరహా వాతావరణం నెలకొందని గ్రేటర్ చెన్నై వాసులు చెబుతున్నారు. చలిగాలుల తీవ్రత దృష్ట్యా తెల్లవారుజామున నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ బస్టాండ్ల వద్ద తగ్గింది. మార్నింగ్ వాక్ కోసం పార్కులకు వెళ్లేవారు ఆలస్యంగా బయటకు వస్తున్నారు. చాలా ప్రాంతాల్లో, ప్రజలు తమ ఇళ్లను వెచ్చగా ఉంచడానికి గది హీటర్లను ఉపయోగిస్తున్నారు.
IND vs AUS: అవన్నీ నకిలీ వార్తలు.. నాకెలాంటి సంబంధం లేదు: కుంబ్లే